ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: దుత్తలూరు మండలంలో అధికారపార్టీ నేతల కక్కుర్తి

ABN, First Publish Date - 2022-07-26T16:57:30+05:30

నెల్లూరు (Nellore): దుత్తలూరు మండలంలో అధికారపార్టీ నేయకులే కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (Nellore): దుత్తలూరు మండలంలో అధికారపార్టీ నేయకులే (YCP leaders) కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. గ్రామంలో సీసీ రోడ్ల కాంట్రాక్టు (Contract)ను దక్కించుకున్నారు. కానీ నాసిరకం (crumbling) పనులతో మమా అనిపిస్తున్నారు. గ్రామస్తులు ప్రశ్నిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దుత్తలూరు మండలం, బోడవారిపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 3 కోట్లు మంజూరయ్యాయి. అయితే రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నిర్మాణంలో సిమెంట్‌కు బదులు డస్టు వాడుతున్నారు. నిబంధనలు పాటించడంలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. రోడ్లు వేసిన నాలుగు రోజులకే పగుళ్లు రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరోవైపు గ్రామంలో అమూల్ పాలకేంద్రం నిర్మాణానికి కేటాయించిన 540 సిమెంట్ బస్తాలను అధికారపార్టీ నేతలు పక్కదారి పట్టించారు. తాము అధికారపార్టీ నేతలమని, అడిగేవారు ఎవరని భావిస్తున్నారో ఏమో.. అందినకాడికి దోచుకుంటున్నారు. వైసీపీ నేతల నిర్వాకంపై సొంతపార్టీ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-07-26T16:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising