ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సమస్యలపై మాట్లాడే దమ్ముందా!

ABN, First Publish Date - 2022-06-27T04:46:27+05:30

జిల్లా రైతుల సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడే దమ్ము జిల్లా ప్రతినిధులకు ఉందా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.

మాట్లాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బాదుడే బాదుడులో మాజీ మంత్రి సోమిరెడ్డి

తోటపల్లిగూడూరు, జూన్‌ 26 : జిల్లా రైతుల సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడే దమ్ము జిల్లా ప్రతినిధులకు ఉందా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు.   మండల ంలోని చిన్నచెరుకూరు గ్రామంలో ఆదివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సోమిరెడ్డి మాట్లాడుతూ  టీడీపీ ప్రభుత్వంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటను నష్టాలకు అమ్ముకున్నారని తెలిపారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్న ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. జిల్లాలో ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు దాదాపు రూ.3వేల కోట్లు నష్టపోయారన్నారు. బీపీటీ ధాన్యానికి సబ్సిడీ విషయంలో టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి రాయితీ కల్పించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల ఖాతాలో సొమ్ము జమ చేసి న్యాయం చేశారని తెలిపారు. రాష్ట్రంలో అందుకు భిన్నంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సన్నరెడ్డి సురేష్‌రెడ్డి, సర్పంచ్‌ భాస్కర్‌, కోడూరు శ్రీనివాస్‌రెడ్డి, ముత్యాల శ్రీనివాసులు, గంగాధర్‌, రాజాయాదవ్‌, పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, గోపాల్‌నాయుడు, శీనయ్య, బొమ్మి సుమన్‌, బొమ్మి కిరణ్‌, మణిరత్నం, అబూబకర్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

కొడవలూరు: రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టీడీపీ నెల్లూరు పార్లమెంట్‌ కార్యదర్శి చెక్కామదన్‌ విమర్శించారు. మండలంలో పాతవంగల్లు పంచాయతీలోని  వడ్డిపాళెం గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జగనన్న బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు.  అనంతరం మాట్లాడుతూ పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పేదలు పూట గడవక అల్లాడుతుంటే వైసీపీ  ప్రభుత్వం సంక్షేమం మరచి  టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు చెల్లించక పోవడంతో వారు తెచ్చిన అప్పుకు వడ్డీలు పెరిగి నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.  రైతులకు వెంటనే ధాన్యం నగదు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు  కేతు వెంకటరమణారెడ్డి, నాయకులు, కార్యకర్తలు 

Updated Date - 2022-06-27T04:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising