ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం!

ABN, First Publish Date - 2022-05-16T05:09:20+05:30

వైసీపీ ఆగడాలకు తొందరలో అడ్డుకట్ట వేస్తామని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమే్‌షకుమార్‌రెడ్డి హెచ్చరించారు.

బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న రమే్‌షకుమార్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, మే 15: వైసీపీ ఆగడాలకు తొందరలో అడ్డుకట్ట వేస్తామని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమే్‌షకుమార్‌రెడ్డి హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన నాగార్జున కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ఆదివారం మద్దిరేవుల హరిజనవాడను సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపై దాడులకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. నాగార్జునపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌రెడ్డి, బీసీ సెల్‌ అధ్యక్షుడు బడుగు వాసుదేవుడు, టీడీపీ కార్యకర్తలు గంగయ్య, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. 

యువత పార్టీకి పట్టుకొమ్మ

 టీడీపీకి యువత పటుగొమ్మ అని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆర్‌. రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాజంపేట పార్లమెంట్‌ తెలుగు యువత కార్యదర్శిగా ఎంపికైన శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ బీసీ సెల్‌ అధికార ప్రతినిధి ఆంజనేయులు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర రైతు కార్యనిర్వహణ కార్యదర్శి చింతం శివారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నవ రత్నాలతో నయవంచన

గాలివీడు: వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో నయవంచన చేసిందని  రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రభుత్వ చర్యలను దుయ్యబట్టారు. ఆదివారం కొర్లకుంట సర్పంచ్‌ మేఘన ఇచ్చిన విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం  చావిడిపల్లెలో పర్యటించి సమస్యలపై మైనార్టీ మహిళలను అడిగి తెలుసుకున్నారు.  రాష్ట్ర టీడీపీ కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటశివారెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ ప్రభాకర్‌, మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, సర్పంచ్‌ పార్థసారధిరెడ్డి, మాజీ సర్పంచులు నరసింహారెడ్డి, మహమ్మద్‌రియాజ్‌, చిన్నపరెడ్డి, ఎస్టీ సెల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మిట్టేనాయక్‌, టీడీపీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వీరరాఘవులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T05:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising