ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుడి కుటుంబానికి న్యాయం చెయ్యండి

ABN, First Publish Date - 2022-01-29T03:45:44+05:30

నాంచారమ్మపల్లి గ్రామానికి చెందిన మారుబోయిన తిరుపతి యాదవ్‌ అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చెయ్యాలని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షడు కోన గురవయ్య యాదవ్‌ పేర్కొన్నారు.

డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న కోన గురవయ్య యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు

కావలి రూరల్‌, జనవరి 28: నాంచారమ్మపల్లి గ్రామానికి చెందిన మారుబోయిన తిరుపతి యాదవ్‌ అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చెయ్యాలని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షడు కోన గురవయ్య యాదవ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కావలి డీఎస్పీ కార్యాలయానికి మృతుని కుటుంబసభ్యులతో కలసి వెళ్లి డీఎస్పీ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. గురవయ్య యాదవ్‌ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం నాంచారమ్మపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుపతయ్య యాదవ్‌ ఈ నెల 1వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందాడన్నారు. ఆయన మృతి పట్ల అనేక అనుమానాలున్నాయని, గ్రామంలోని పొలాల దారుల విషయంలో అగ్రవర్ణాల వారు అనేక మార్లు బెదిరించారని సూచించారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో తిరుపతి యాదవ్‌ మృతి చెందటం పలు అనుమానాలకు దారితీసిందన్నారు. దీంతో డీఎస్పీ ప్రసాద్‌ మాట్లాడుతూ పోస్ట్‌మార్టం రిపోర్టు రావాల్సి ఉందని, విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మృతుడి కుమారుడు శ్రీనివాసులు, యాదవ మహాసభ సభ్యులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-29T03:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising