ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీటర్ల బిగింపు ప్రక్రియకు మేం వ్యతిరేకం: సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-07-29T22:00:24+05:30

వ్యవసాయ మోటార్లకు(Agricutural Motors) మీటర్ల బిగింపు ప్రక్రియకు తాము వ్యతిరేకమని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. చేతనైతే విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులు కట్టేందుకు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

AP News: వ్యవసాయ మోటార్లకు(Agricutural Motors) మీటర్ల బిగింపు ప్రక్రియకు తాము వ్యతిరేకమని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చేతనైతే విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పులు కట్టేందుకు, ప్రైవేటు కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసమే మోటార్లకు మీటర్లు బిగించి రైతులను ఇబ్బందుల పాలు చేసే కుట్ర జరుగుతోందని సోమిరెడ్డి ఆరోపించారు. మోటార్లకు మీటర్లను పెట్టాల్సిందేనని సీఎం అనడం అన్యాయమన్నారు. 


రైతుల పంపుసెట్లకు మోటర్లు బిగించడం అన్యాయమని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్తు సంస్కరణను బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తోన్నా.. మన రాష్ట్రంలో వీటి అమలుకు సీఎం జగన్ పూనుకోవడం బాధాకరమన్నారు. దీనివల్ల రైతులపై భవిష్యత్తులో విద్యుత్ భారం తప్పదని పేర్కొంటున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.  

Updated Date - 2022-07-29T22:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising