ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అత్యుత్సాహం

ABN, First Publish Date - 2022-05-25T02:54:48+05:30

వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌బాషా అత్యుత్సాహం ప్రదర్శించి, తాము ఉండే ఇంట్లోకి సుమారు 15 మంది దర్గా సిబ్బందితో అక్రమంగా

పోలీస్‌స్టేషన్‌ వద్ద రిజిస్టర్‌ పత్రాలు చూపుతున్న బాఽధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దర్గా సిబ్బందితో కలిసి దౌర్జన్యం

 న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు

ఏఎస్‌పేట, మే 24: వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌బాషా అత్యుత్సాహం ప్రదర్శించి, తాము ఉండే ఇంట్లోకి సుమారు 15 మంది దర్గా సిబ్బందితో అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యం చేశారని ముస్లిం మహిళలు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సయ్యద్‌ అబీదా, దర్గా ముత్తవల్లి అఫీజ్‌పాషాకు మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో అబీదా వంశపారపర్యంగా ఉంటున్న తన సొంత ఇల్లు మరమ్మతులకు గురికావడంతో దాన్ని రిపేరు చేసుకుంటోంది. అది దర్గాకు చెందిన ఆస్తి అని, అన్యాయంగా అక్రమించుకున్నారని వారిపై తరుచూ వేధింపులకు గురి చేసేవాడు. ఇటీవల మరమ్మతులు నిలిపివేయాలని ఆదేశాలు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నంలో వక్ప్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌బాషా, దర్గా ఉద్యోగులు రఫీ, ఖలీల్‌, ఖాజా, మరో 15 మంది దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి తమను నెట్టివేయడంతోపాటు గందరగోళాన్ని సృష్టించారని బాధితులు వాపోయారు.  దీంతో వెంటనే ఇంట్లోవారు, చుట్టుపక్కలవారు రావడంతో వారు వెనుతిరిగారని పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్‌ఐ సుభానీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. తరుచూ తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  బాధితులు కోరారు. తమవద్ద పంచాయతీ పన్నులు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌ అన్ని ఆధారాలున్నా కక్షపూరితంగా వేధిస్తున్నారని వారు ఆరోపించారు.


Updated Date - 2022-05-25T02:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising