ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నశించిపోతున్న పశు, వృక్షజాతులను కాపాడాలి

ABN, First Publish Date - 2022-05-22T03:08:59+05:30

నశించిపోతున్న పశు,పక్షి, వృక్ష జాతులను కాపాడాలని రాష్ట్ర బయోడైవర్షిటీ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ నళినిమోహన్‌ అన్నారు.

సిబ్బందికి సూచనలిస్తున్న నళినిమోహన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-రాష్ట్ర బయోడైవర్షిటీ బోర్డు  కార్యదర్శి 

ఉదయగిరి రూరల్‌, మే 21: నశించిపోతున్న పశు,పక్షి, వృక్ష జాతులను కాపాడాలని రాష్ట్ర బయోడైవర్షిటీ బోర్డు  కార్యదర్శి డాక్టర్‌ నళినిమోహన్‌ అన్నారు. శనివారం జీవవైవిధ్య మండలి సౌజన్యంతో ఫడ్స్‌ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో ఉదయగిరిలో పెంచుతున్న  నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ నశించిపో తున్న వృక్ష, పక్షు, జంతుజాతులను ఏ విధంగా కాపాడుకో వాలో అవగాహన కల్పించాలన్నారు. ఉదయగిరి, దుత్తలూ రు, మర్రిపాడు మండలాల్లో ప్రతి గ్రామానికి వెయ్యి చొప్పున ఔషధ మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ కింద రోడ్డుకిరువైపులా నాటేందుకు ఎర్రచందనం, జిట్రేగి, కుంకుడు, మర్రి, జువ్వి, రావి మొక్కలను ఉచితంగా అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫడ్స్‌ డైరెక్టర్‌ పీవీ రమణయ్య, దుత్తలూరు కో-ఆర్డినేటర్‌ జొన్నలగడ్డ కేశవరావు, కమిటీ సభ్యుడు బసిరెడ్డి మాలకొండారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు అమర్‌నాధ్‌రెడ్డి, నాగూర్‌బీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T03:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising