ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీ సోషల్‌ ఆడిట్‌పై అనుమానాలు

ABN, First Publish Date - 2022-05-26T03:35:54+05:30

మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల సోషల్‌ ఆడిట్‌పై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులను క్షేతస్ధాయిలో పరిశీ

చిలకలమర్రి గ్రామ సభలో పాల్గొన్న అధికారులు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎఫ్‌ఏ, టీఏల కనుసన్నల్లో పనుల తనిఖీ

అనంతసాగరం, మే 25: మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల సోషల్‌ ఆడిట్‌పై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులను క్షేతస్ధాయిలో పరిశీలన చేయకుండానే ఆడిట్‌ సభ్యులు నివేదికలు సిద్ధం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్ల కనుసన్నల్లో సోషల్‌ ఆడిట్‌ పూర్తి చేశారని, దీంతో పనుల్లో జరిగిన అవినీతి బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొన్నరన్న విషయం  ఇటీవల జరిగిన గ్రామసభల ద్వారా బహిర్గమైంది. మండలంలో 25 గ్రామ పంచా యతీలు ఉండగా 2019-20, 202-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాలకు గాను సుమారు రూ.14 కోట్లతో ఉపాధి పనులు జరిగినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇందులో పంటకాలువల మరమ్మతులు, ఫారంపాండ్స్‌, ఇళ్ల స్ధలాల అభివృద్ధి, జంగల్‌ క్లియరెన్స్‌, అవెన్యూ ప్లాంట్‌ ద్వారా మొక్కలు నాటే  పనులు జరిగాయి. అయితే మూడేళ్ల కాలంలో కరానా కారణంగా ఉపాధి పనులపై సోషల్‌ అడిట్‌ జరగలేదు. మూడేళ్ల పనులకుగాను పదిహేను రోజులుగా సోషల్‌ ఆడిట్‌ సభ్యులు వారికి నిర్ధేశించిన గ్రామాలకు చేరుకొని పనుల పరిశీలన చేశారు. ఆడిట్‌ సభ్యులకు గ్రామాల్లో ఉండేదుకు వసతి, ఇతర సదుపాయాలు ఎఫ్‌లు సమకూర్చారు. అనేపథ్యంలో జరిగిన పనుల తనిఖీలు అన్నీ ఎఫ్‌ఏ, టీఏల పర్యవేక్షణలో జరిగినట్లు  ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సోషల్‌ ఆడిట్‌ సభ్యులు తనిఖీల అనంతరం గ్రామాల్లో గ్రామమసభలు నిర్వహించి జరిగిన పనులు, వినియోగించిన నిధుల వివరాలు వెల్లడించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భారీగా ఉపాధి నిదులు దుర్వినియోగం చేశారని పడమటికంభంపాడు సర్పంచు లావణ్య ఇటీవల గ్రామసభలో అధికారులను నిలదీశారు, చిలకలమర్రికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇతర ప్రాంతాలలో స్ధిరపడగా ఇక్కడ జరిగిన ఉపాధి పనులకు వచ్చినట్లు నిదులు డ్రా చేసిన విషయాన్ని గ్రామసభలో మాజీ ఎంపీపీ మనగపాటి సుబ్బరాజు అధికారులను ప్రశ్నించారు. మంచాలపల్లి, సోమశిలతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఫారంపాండ్స్‌ నిర్మించినట్లు రికార్డులు చెబుతుండగా, క్షేతస్ధాయిలో ఆపనులు  కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు.  బాధ్యులపై  అధికారులు సమగ్ర విచారణ జరపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు 


Updated Date - 2022-05-26T03:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising