ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో విద్యార్థి దుర్మరణం

ABN, First Publish Date - 2022-01-23T04:07:37+05:30

విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుచ్చి నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాళెంలో శనివారం

కార్తీక్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దర్గాకు డెకరేషన్‌ చేస్తుండగా దుర్ఘటన

బుచ్చిరెడ్డిపాళెం,జనవరి 22 : విద్యుదాఘాతంతో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుచ్చి నగర పంచాయతీ పరిధిలోని ఇస్కపాళెంలో శనివారం ఉదయం జరిగింది. ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి కథనం మేరకు, బుచ్చి కోదండరామపురానికి చెందిన చిన్నంగారి రాము, జానకిల చిన్న కొడుకు కార్తీక్‌(22) ఇస్కపాళెంలోని ఓ దర్గాలో ఉత్సవాల సందర్భంగా శనివారం ఉదయం విద్యుత్‌ దీపాలంకరణ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యా డు. వెంటనే బుచ్చిలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు  వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని గండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కార్తీక్‌ ఆత్మకూరులోని ఓ ఐటీఐలో చదువుకుంటూ సెలవు రోజుల్లో కూలి పనులు చేసి తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవా డు. అతని మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుము కున్నాయి.


------

Updated Date - 2022-01-23T04:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising