ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRది మరణం కాదు.. హత్య.. రిలయన్స్ (Reliance) కుట్ర.. అని సాక్షిలో రాయలేదా?: Venkata Ramana Reddy

ABN, First Publish Date - 2022-06-30T18:38:59+05:30

వైసీపీ ప్లీనరీలో చవటలు, దద్దమ్మలు మాట్లాడుతున్నారని టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (Nellore): వైసీపీ ప్లీనరీ (YCP Plenary)లో చవటలు, దద్దమ్మలు మాట్లాడుతున్నారని, చవట, దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి (Venkata Ramana Reddy) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము కూడా బూతులు మాట్లాడగలమని అన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అరబిందో ఫార్మాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందన్నారు. యు.ఎస్.ఎఫ్.డి.ఏ (USFDA) (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ) నోటీసులు ఇచ్చారని, అలాగే సెబీ వాళ్లు కూడా నోటీసులు ఇచ్చారన్నారు. 


సాక్షి టీవీ అనుమతి రద్దు చేసింది నిజం కాదా?.. దీనిపై హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నది నిజం కాదా? అని వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. వైఎస్‌ది మరణం కాదు.. హత్యని.. రిలయన్స్ కుట్ర అని సాక్షిలో రాయలేదా? అని నిలదీశారు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఇంటికొస్తే సీఎం జగన్ చేతులు కట్టుకొని.. రాజకీయ అవసరాల కోసం స్వాగతం పలికారని విమర్శించారు. 2019 ఎన్నికలకు ముందు నారా వారి రక్తచరిత్ర అని రాశారని, అధికారంలోకి వచ్చిన తరువాత నిగ్గుతేల్చాలి కదా అని నిలదీశారు. వైఎస్ వివేకాను హత్య చేయించింది జగన్మోహన్ రెడ్డే అని అనుమానంగా ఉందన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.. ఎవరు ఎవరిని చంపుతారో తెలియదన్నారు. దయచేసి విజయలక్ష్మి, షర్మిళ, భారతికి జడ్ సెక్యూరిటీ ఇవ్వాలని, లేదంటే టీడీపీకే ఆపాదిస్తారని కేంద్రమంత్రి అమిత్ షాకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. మీడియా వారిని చూస్తే వైసీపీ నేతలకు ఫ్యాంటు తడచిపోతుందన్నారు. విధానాలు మీద విమర్శలకు తాము సిద్ధమని.. తిట్టుకునేందుకు అయితే వ్యతిరేకమని అన్నారు. టీవీ5, ఏబీఎన్ మీడియాలను ఆపేసిన వైసీపీ.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షి రాకూడదు అనుకుంటే పరిస్థితి ఏంటన్నారు. కాళహస్తి రిపోర్టర్‌పై దాడిని ఖండిస్తున్నానని వెంకట రమణా రెడ్డి అన్నారు.

Updated Date - 2022-06-30T18:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising