ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభయారణ్యంలో వన్యప్రాణులు ఎలా ఉన్నాయ్‌!

ABN, First Publish Date - 2022-10-17T05:32:09+05:30

పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి అభయారణ్యంలో కేంద్ర అటవీ వన్యప్రాణి పర్యవేక్షణ, గణాంక అధ్యయన బృందం (ఎంఈఈ) ఆదివారం పర్యటించింది.

అభయారణ్యంలో సాసర్‌పిట్స్‌లో నీటిని పరిశీలిస్తున బృందం సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర అటవీ బృందం ఆరా

గోనుపల్లి గిరిజనులతోనూ మాటామంతీ

 

రాపూరు, అక్టోబరు 16 : పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి అభయారణ్యంలో కేంద్ర అటవీ వన్యప్రాణి పర్యవేక్షణ, గణాంక అధ్యయన బృందం (ఎంఈఈ) ఆదివారం పర్యటించింది. నెల్లూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో 1.8 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా నెల్లూరు జిల్లా పరిధిలో 40 వేల హెక్టార్ల విస్తీర్ణం ఉండటంతో ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించి అటు వన్యప్రాణులు, ఇటు అటవీ అభివృద్ధి చేపడుతున్న  విషయం తెలిసిందే. బృంద చైర్మన్‌, పశ్చిమ బెంగాల్‌ రిటైర్డ్‌ పీసీసీఎఫ్‌ ప్రదీప్‌ శుక్ల, సభ్యులు దిపంకర్‌ గోష్‌, రతిన్‌ బర్మన్‌, బీ.ఎస్‌ అధికారి, జిల్లా అటవీశాఖాధికారి చంద్రశేఖర్‌లు రాపూరు రేంజ్‌లోని పెంచలకోనఎకో సెంటర్‌, పలు బేస్‌ క్యాంపులు పరిశీలించి అక్కడి రికార్డులను పరిశీలించారు. అభయారణ్యంలో  ఏ ఏ వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయి, ఆహారం, నీటి వనరులను ప్రత్యక్షంగా అడవుల్లో తిరుగుతూ పరిశీలించారు. డీఎఫ్‌వో చంద్రశేఖర్‌ అభయారణ్యం ప్రత్యేకతల గురించి వారికి వివరించారు.  అనంతరం అభయారణ్యం మరింత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు. బేస్‌క్యాంపులను పరిశీలించి, రాత్రి గోనుపల్లిలోని అడవుల్లో అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులతో మాట్లాడి ఇక్కడి గిరిజనుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడుతూ పెనుశిల అభయారణ్యంలో ఈ బృందం పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి భారత ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని, తద్వారా అభయారణ్యం అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయిస్తుందని చెప్పారు. స్థానిక రేంజర్‌ రవీంద్రబాబు, డీఆర్వో మస్తానయ్య, అటవీ శాఖ అధికారులు ఉన్నారు.  

Updated Date - 2022-10-17T05:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising