వంటనూనె దుకాణాలపై దాడులు
ABN, First Publish Date - 2022-03-08T03:35:59+05:30
కోటలోని పలు వంట నూనె దుకాణాలను తహసీల్దారు పద్మావతి, సీఎస్‌డీటీ జగదీష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలు చేస్తున్న తహసీల్దారు, సీఎస్‌డీటీ
కోట, మార్చి 7: కోటలోని పలు వంట నూనె దుకాణాలను తహసీల్దారు పద్మావతి, సీఎస్‌డీటీ జగదీష్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అరుణ థియేటర్ సెంటర్, బజారువీధిలో ఉన్న పలు దుకాణాల్లో వంటనూనెను పరిశీలించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ద నేపథ్యంలో వంటనూనెను అధిక ధరలకు విక్రయిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో తనిఖీలు చేసినట్లు తెలిపారు.
Updated Date - 2022-03-08T03:35:59+05:30 IST