ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల అరెస్టు

ABN, First Publish Date - 2022-01-21T02:49:41+05:30

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం నెల్లూరు కలేక్టరేట్‌ ముట్టడానికి వెళుతున్న ఉపాధ్యాయులను పోలీసులు

ఉదయగిరిలో ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి, జనవరి 20: ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం నెల్లూరు కలేక్టరేట్‌ ముట్టడానికి వెళుతున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయగిరి, సీతారామపురం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు, కార్లు, ప్రత్యేక వాహనాలను తెల్లవారుజాము నుంచే తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌ సెంటరు, ఆనకట్ట తదితర ప్రాంతాలలో సిబ్బందితో సీఐ గిరిబాబు, ఎస్‌ఐ అంకమ్మలు తనిఖీలు నిర్వహించి 21 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. సంతకాలు సేకరించి అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు చంద్రశేఖరరెడ్డి, మన్నెం శ్రీనివాసులు, రఫీ, రంతుజాని, ఎలీషా, మన్సూరు తదితరులు పాల్గొన్నారు.



 వీకే పాడులో..


వరికుంటపాడు, జనవరి 20: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా గురువారం ఫ్యాప్టో పిలుపు మేరకు కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న యూటీఎఫ్‌ నాయకులను ముందుగానే పోలీసులు అదుపులోకి  అరెస్ట్‌ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై బాలమహేంద్రనా యక్‌ తన సిబ్బందితో ఉదయాన్నే ఉపాధ్యాయుల నివాసాలకు వెళ్లి అదుపులోకి తీసుకొని, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కొద్దసేపటి తరువాత విడుదల చేశారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రతినిధి ఆర్‌. నాగార్జున ఆధ్వర్యంలో సుమారు 30 మంది ఉపాధ్యాయులు పోలీసుల కళ్లుగప్పి కలెక్టరేట్‌ ముట్టడిలో పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-21T02:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising