ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి

ABN, First Publish Date - 2022-04-07T04:13:19+05:30

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

శాంతకుమారికి నియామకపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

ఉదయగిరి రూరల్‌, ఏప్రిల్‌ 6: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆనకట్ట సమీపంలో ఉన్న వైఎ్‌సఆర్‌ విగ్రహానికి పాలభిషేకం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024లో రాష్ట్రానికి సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి, ఉదయగిరికి ఎమ్మెల్యేగా తాను గెలవడం ఎంతో ముఖ్యమన్నారు. త్వరలో ఉదయగిరి-నందవరం, కావలి-దుత్తలూరు రహదారుల నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం వైసీపీ నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా నియమితులైన ఎస్‌.శాంతకుమారికి నియామకపత్రాం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు గాజుల తాజుద్దీన్‌, ఎంపీపీ చేజర్ల జయంత్‌రెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు శాంతి, మండల వైసీపీ కన్వీనర్లు అక్కి భాస్కర్‌రెడ్డి, వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి, ఆండ్రా బాలగురవారెడ్డి, సొసైటీ అధ్యక్షులు చేజర్ల చలమారెడ్డి, కామేపల్లి వెంకటరత్నం, సర్పంచులు కె.వెంకటేశ్వరరెడ్డి, గౌస్‌మొహీద్దీన్‌, నాయకులు మూలె సుబ్బారెడ్డి, రామయ్య, లక్ష్మయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం 

దుత్తలూరు మండల రెవెన్యూ అధికారుల పనితీరుపట్ల ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో కావలి ఆర్డీవో శీనానాయక్‌ అధ్యక్షతన అధికారుల సమావేశం నిర్వహించారు. తహసీల్దారు, రెవెన్యూ కార్యదర్శులు డబ్బులు ఇస్తేనే పని చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదని తహసీల్దారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా రెవెన్యూ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. దుత్తలూరు వీఆర్వో మల్లేశ్వరరావుపై అభియోగాలు రావడంతో ఆయన్ను దగదర్తి మండలానికి బదిలీ చేస్తున్నట్లు ఆర్డీవో శీనానాయక్‌ తెలిపారు. అనంతరం మండలంలోని వెంకటంపేట గ్రామంలో సచివాలయ నూతన భవనాలను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేజర్ల జయంత్‌రెడ్డి, జడ్పీటీసీ లెక్కల లక్ష్మీకాంతమ్మ, నాయకులు చేజర్ల చలమారెడ్డి, లెక్కల మాలకొండారెడివ్డ, వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-07T04:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising