ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు రేషన్‌ దుకాణాలు సీజ్‌

ABN, First Publish Date - 2022-10-08T04:51:21+05:30

మండలంలోని తలుపూరుపాడు, చెన్నవరపాడు రేషన్‌ దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. నిల్వ బియ్యంలో తేడా ఉండడంతో రెండు దుకాణాలను సీజ్‌ చేసి డీలర్లపై శుక్రవారం కేసు నమోదు చేశారు.

తలుపూరుపాడు రేషన్‌ దుకాణంలో నిల్వ బియ్యం బస్తాలను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ సీఐ మాణిక్యరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బియ్యం నిల్వల్లో తేడా 

డీలర్లపై కేసు నమోదు


సంగం, అక్టోబరు 7: మండలంలోని తలుపూరుపాడు, చెన్నవరపాడు రేషన్‌ దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయగా.. నిల్వ బియ్యంలో తేడా ఉండడంతో రెండు దుకాణాలను సీజ్‌ చేసి డీలర్లపై శుక్రవారం కేసు నమోదు చేశారు. గురువారం తలుపూరుపాడు రేషన్‌ దుకాణం తనిఖీకి వచ్చిన విజిలెన్స్‌ అధికారులు డీలర్‌ లేకపోవడంతో దుకాణానికి తాళం వేసి వెళ్లిన విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం విజిలెన్స్‌ సీఐ మాణిక్యరావు, సివిల్‌ సప్లయీస్‌ డీటీ మురళీ తలుపూరుపాడు వచ్చి డీలర్‌ ఖాదర్‌బాషా సమక్షంలో దుకాణం తలుపులు తీసి బియ్యం నిల్వ పరిశీలించారు. ఉండాల్సిన దానికంటే 1,365 కిలోల బియ్యం తక్కువగా ఉన్నాయి. దీనిపై డీలర్‌ను విజిలెన్స్‌ సీఐ ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పాడు. దీంతో దుకాణాన్ని సీజ్‌ చేసి డీలర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం పక్క గ్రామమైన చెన్నవరపాడు రేషన్‌ దుకాణానికి వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ కూడా ఉండాల్సిన నిల్వ కంటే 1,035 కిలోల  బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో దుకాణాన్ని సీజ్‌ చేసి డీలర్‌పై కేసు నమోదు చేశారు. కాగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీలో విజిలెన్స్‌ కానిస్టేబుల్‌ బాషా, వీఆర్వో ప్రసాద్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-08T04:51:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising