ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్రం జాషువాకు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-07-25T04:59:35+05:30

కవి గుర్రం జాషువా 52వ వర్ధంతి సభ నగరంలోని జాషువా గ్రంథాలయంలో ఆదివారం జరిగింది.

గుర్రం జాషువాకు ఘన నివాళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) జూలై 24 : కవి గుర్రం జాషువా 52వ వర్ధంతి సభ నగరంలోని జాషువా గ్రంథాలయంలో ఆదివారం జరిగింది. సభకు జాషువా కవితా పీఠం ప్రధాన కార్యదర్శి అవ్వారు శ్రీధర్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యులు డాక్టర్‌ కె.లక్ష్మీ నారాయణరెడ్డి మాట్లాడుతూ జాషువా  సమాజంలోని సామాజిక రుగ్మతలను తన కలంతో ఎదుర్కొన్నారని కొనియాడారు. విశ్రాంత ఉపాఽధ్యాయడు, బాలసాహితీవేత్త డాక్టర్‌ గంగిశెట్టి శివకుమార్‌ మాట్లాడుతూ జాషువా ఎన్నో పదవులు అలంకరించినా ఆయనకి కూడా అవమానాలు తప్పలేదన్నారు. జాషువా కవితాపీఠం, పద్మభూషణ గుర్రం జాషువా ప్రజా గ్రంథాలయం ప్రధాన కార్యదర్శులు శ్రీధర్‌బాబు, బద్దిపూడి శీనయ్య, కోశాధికారులు పీజీడీ కృపాల్‌, జాషువా కవితాపీఠం కార్యవర్గ సభ్యులు శరత్‌బాబు, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు ఎస్‌కె గౌస్‌బాషా, కుడుముల సుబ్బారావు, కుంభగిరి కొండయ్య, నిర్వాహకులు జనార్దన్‌ మాట్లాడుతూ జాషువా కవిని జాతీయ స్థాయిలో గుర్తించాలని, ఆయన పేరుతో స్టాంపు విడుదల చేయాలని  కిరణశ్రీ  కలలు కన్నారని, వాటిని సాకారం చేసుకునే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో కిరణశ్రీ కుటుంబ సభ్యులు, జాషువా కవితా పీఠం కమిటీ సభ్యులు, కిరణశ్రీ అభిమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-25T04:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising