ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాఫిక్‌ నిబంధనలతో ప్రజల అవస్థలు

ABN, First Publish Date - 2022-01-22T03:03:45+05:30

పట్టణంలో అడ్డగోలు ట్రాఫిక్‌ నిబంధనలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పౌరసమితి సభ్యులు బీకే. ప్రసాద్‌, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వి.వి. రమణయ్య తెలిపారు.

మానవహారంలో పౌరసమితి సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), జనవరి 21: పట్టణంలో అడ్డగోలు ట్రాఫిక్‌ నిబంధనలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పౌరసమితి సభ్యులు బీకే. ప్రసాద్‌, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వి.వి. రమణయ్య తెలిపారు. పాతబస్టాండ్‌ మీదుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం స్థానిక పాతబస్టాండ్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ట్రాఫిక్‌ నిబంధనల పేరుతో సీఐ నాగమల్లేశ్వరరావు ప్రజలను, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పాత బస్టాండ్‌లో ఆక్రమణలు తొలగించి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.  ఇప్పటికైనా పాత పద్ధతిలోనే ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు పలికారు.  పౌరసమితి నాయకులు పీ. గౌస్‌ భాషా, రాధాకృష్ణయ్య, దశయ్య, కృష్ణారెడ్డి, సీహెచ్‌. చిన ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T03:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising