ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న గృహ నిర్మాణంలో తోటపల్లిగూడూరు లాస్ట్‌

ABN, First Publish Date - 2022-12-16T23:10:53+05:30

జగనన్న గృహ నిర్మాణంలో జిల్లాలో తోటపల్లి గూడూరు మండలం లాస్టులో ఉందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు.

లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోటపల్లిగూడూరు, డిసెంబరు 16 : జగనన్న గృహ నిర్మాణంలో జిల్లాలో తోటపల్లి గూడూరు మండలం లాస్టులో ఉందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అన్నారు. మండలంలోని వరకవిపూడి, మండపం గ్రా మ పంచాయతీల్లో శుక్రవారం ఆయన జగనన్న లే అవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మండలంలో అధికారుల అలసత్వం వల్లే జగనన్న గృహాలు ఇప్పటికీ పూర్తి కాలేదని, ఇలాగే ఉంటే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో అధికారులపై అసహన వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ సిబ్బంది, పంచాయతీ సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గృహ నిర్మాణాలు పూర్తి చేయించేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రతి శనివారం గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించాలన్నారు. 2023 జనవరి నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలని కోరారు. బిల్లులు చెల్లింపులు ఆలస్యం లేకుండా చెల్లిస్తున్నామన్నారు. కలెక్టర్‌ వెంట ప్రత్యేకాధికారి చేజర్ల శ్రీనివాసులు, ఎంపీడీవో హేమలత, తహసీల్దారు హమీద్‌, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సర్పంచులు ఇసనాక రమేష్‌రెడ్డి, కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising