ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్‌

ABN, First Publish Date - 2022-05-25T05:16:24+05:30

నగరంలోని ఇరుగోళమ్మ సంఘం పెట్రోల్‌ బంకు ఎదురుగా జరిగిన హత్యాయత్నం కేసులో చిన్నబజారు పోలీసులు ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు.

నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం), మే 24:  నగరంలోని ఇరుగోళమ్మ సంఘం పెట్రోల్‌ బంకు ఎదురుగా జరిగిన హత్యాయత్నం కేసులో చిన్నబజారు పోలీసులు ముగ్గురు నిందితులను మంగళవారం  అరెస్టు చేశారు. చిన్నబజారు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ఎ. సైదులు నిందితుల వివరాలను విలేకరులకు తెలిపారు. ‘నగరంలోని టైలర్స్‌కాలనీకి చెందిన వి. సురేష్‌ స్టీల్‌ వెల్డింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు మూలాపేట బ్రహ్మణవీధికి చెందిన విజయ్‌, కొండదిబ్బ మున్సిపల్‌ క్వార్టర్స్‌కు చెందిన ఎం. అరుణ్‌పాండే, సింహాద్రిలతో పాతగొడవలున్నాయి. ఈనెల 22న సురేష్‌ తన స్నేహితుడు షామీర్‌తో కలిసి ఇరుగోళమ్మసంఘం పెట్రోల్‌ బంకు ఎదురుగా ఉన్న చిల్లర దుకాణం వద్ద ఉండగా విజయ్‌, అరుణ్‌పాండే, సింహాద్రి చేరుకుని కొబ్బరి బోండాలు నరికే కత్తితో సురేష్‌పై దాడి చేశారు. సురేష్‌ కుడికన్నుకు తీవ్రగాయమైంది. స్థానికులు రావడాన్ని గమనించిన ముగ్గురు నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. సురేష్‌ను అతని స్నేహితులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. బాధితుడు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీఐ పర్యవేక్షణలో ఎస్‌ఐ సైదులు నిందితుల కోసం గాలిస్తుండగా మంగళవారం ఇరుగోళమ్మ సంఘం సమీపంలో స్వర్ణాల చెరువు వద్ద విజయ్‌, అరుణ్‌పాండే, సింహాద్రిలను అరెస్ట్‌ చేసి వారి నుంచి హత్యాయత్నానికి వినియోగించిన కత్తినిస్వాధీనం చేసుకున్నారు’ అని ఎస్‌ఐ వివరించారు.

Updated Date - 2022-05-25T05:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising