ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేలని లెక్క.. సిద్ధం కాని జాబితా!

ABN, First Publish Date - 2022-12-16T23:18:43+05:30

జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితా ఇంకా సిద్ధం కాలేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు రెండు, మూడు రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు.

డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూర్తిస్థాయిలో అందని ఉపాద్యాయుల వివరాలు

సీనియర్ల జాబితా తయారీలో ఆలస్యం

దరఖాస్తుకు నేటితో ముగుస్తున్న గడువు

దొడ్డిదారిన స్థానచలనాలకు యత్నాలు

పెరుగుతున్న సిఫారసు లేఖలు

నెల్లూరు (విద్య) డిసెంబరు 16 : జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితా ఇంకా సిద్ధం కాలేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు రెండు, మూడు రోజుల నుంచి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఎంఈఓలు టీచర్ల లెక్కలు వేస్తూ ఉన్న సమాచారం మేరకు విద్యాశాఖ కార్యాలయానికి అందచేస్తున్నారు. ఇంకా కొన్ని మండలాల వివరాలు అందకపోవడంతో పూర్తిస్థాయిలో జాబితా రూపొందించేందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బదిలీల దరఖాస్తుకు శనివారం గడువు ముగుస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దొడ్డిదారి బదిలీలకు రంగం సిద్ధం చేయడంతో ఆ దిశగా కొందరు టీచర్లు తమకు అనుకూల ప్రాంతాలకు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు.

ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయడంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ జిల్లా విద్యాశాఖాధికారులతో ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. బదిలీలపై పలు సూచనలు చేసి జాబితాలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎస్‌జీటీ, ఎస్‌ఏ, తత్సమాన అర్హత కలిగిన పండిట్‌లు, పీఈటీల వివరాలు తీసుకున్నారు. అదేవిధంగా తక్కువ సర్వీస్‌ కలిగిన వారి వివరాలు, ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉన్నత పాఠశాలల హెచఎంల సమాచారం కూడా సేకరించారు. ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్యను కూడా నివేదికలో పొందుపరిచారు. మొత్తం 46 మండలాల (ఉమ్మడి జిల్లా) సీనియారిటీ జాబితా రూపొందించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆమోదానికి పంపిన తరువాత ఈ నెల 20వతేదీ నాటికి ఆనలైనలో అప్‌లోడ్‌ చేయనున్నారు. అలాగే 3 నుంచి పదోతరగతి వరకు 138 మంది, 6 నుంచి పదోతరగతి వరకు 96 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలల్లో హెచఎం, పీడీ పోస్టులను రద్దు చేస్తున్నారు. దీనికనుగుణంగా జిల్లాలో ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయనే వివరాలు లెక్కిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం 20కిపైగా హెచఎం పోస్టులు రద్దు కానున్నాయని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు.

సిఫారసు లేఖలతో..

ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేసిన ప్రభుత్వం తమ వర్గీయులకు, అనుకూల వ్యక్తులకు దొడ్డిదారిన కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారని ఉపాఽధ్యాయ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. అఽధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల సిఫార్సులతో జిల్లాలో 20 మందికిపైగా టీచర్లు నెల్లూరు నగర సమీపంలోని స్కూళ్లలో పోస్టింగ్‌ల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సిఫార్సు లేఖలను అందచేసిన వారి జాబితాలను సైతం విజయవాడలో జరిగిన డీఈఓల సమావేశంలో రహస్యంగా అందచేసినట్లు ఓ అధికారి చెప్పడం విశేషం.

దరఖాస్తుకు నేటితో ఆఖరు

బదిలీల షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నుంచి 17వ తేదీ ఆనలైనలో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఆది, సోమవారాల్లో దరఖాస్తులను పరిశీలించి కేటగిరి మేరకు 20వ తేదీన సీనియారిటీ జాబితాతోపాటు అభ్యంతరాలకు అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఒకేచోట ఐదేళ్లు పని చేసిన ఉన్నత పాఠశాలల హెచఎంలు, ఎనిమిదేళ్లు పనిచేసిన ఎస్‌జీటీ, ఎస్‌ఏలు తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేయకుంటే కేటగిరి 3, 4 పరిధిలో ఉన్న పాఠశాలలకు బదిలీ చేస్తామని, క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, దరఖాస్తుల గడువు శనివారం ముగియనుండడంతో ఎస్‌జీటీలు ఎవరెవరు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారని ఉపాధ్యాయ సంఘం నేతల చెబుతున్నారు. విద్యాశాఖ నుంచి అధికారికంగా ఏ పాఠశాలలో ఉపాధ్యాయులు మిగిలపోతున్నారో.. ఏయే పాఠశాలలకు ఉపాధ్యాయులు అవసరమో తెలియచేసి దరఖాస్తు గడువు పెంచాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు..

Updated Date - 2022-12-16T23:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising