ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిడ్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-01-28T02:37:33+05:30

టిడ్కో గృహసముదాయంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్ర తాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు

టిడ్కో గృహ సముదాయాన్ని అధికారులతో కలిసి పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, జనవరి27: టిడ్కో గృహసముదాయంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్ర తాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మద్దూరుపాడు లోని టిడ్కో గృహ సముదాయాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడి సమస్యలపై సమీక్షించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గృహసముదాయంలో పెద్ద ఎత్తున పైనుంచి వర్షం నీరు చేరాయని,  ప్రహారీ  లేకపోవ డంవల్ల పాములు సైతం సంచరిస్తున్నాయని,  తాగునీటి సౌకర్యం లేదని స్థానికులు ఏకరువు పెట్టారు.  ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి అక్కడి నుంచే టిడ్కో రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడి  సమస్యలపై చర్చించారు. వీలైనంత త్వరలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తా నని ఆయన  తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిష నర్‌ శివారెడ్డి, టిడ్కో ఈఈ, మున్సిపల్‌ డీఈ శ్రీనివాసులు, నేతలు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, వడ్లమూడి వెంకటేశ్వర్లు, కుందుర్తి కామయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T02:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising