ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడుకగా లోకేష్‌ జన్మదినం

ABN, First Publish Date - 2022-01-24T04:01:41+05:30

సూళ్లూరుపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు

సూళ్లూరుపేట : కేకు కట్‌చేస్తున్న టీడీపీ నేత నెలవల సుబ్రహ్మణ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, జనవరి 23 : సూళ్లూరుపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం కేకు కట్‌చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిశోర్‌, తెలుగుయువత అధ్యక్షుడు మేడా సాయి, దంతాల రవి, బండారు ఆంజనేయులు,  కొండలరావు, రాజేశ్వరి,  యామిని పాల్గొన్నారు. 

నాయుడుపేట: నాయుడుపేట గడియారం సెంటర్‌ వద్ద ఆదివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం కేకు కట్‌చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ  పట్టణ  అధ్యక్షుడు కందలకృష్ణారెడ్డి, నాయకులు దార్లరాజేంద్ర, చిరువెళ్ల మునిరాజ, నాన్నాబాల సుబ్బారావు,  నారాయణ,  రవి, ఖలీల్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

తడ : నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు తడలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బజారుకూడలిలో భారీకేకును కట్‌చేసి పంచిపెట్టారు.  కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మన శ్రీధర్‌, నాయకులు కామిరెడ్డి మురళీరెడ్డి, బొమ్మన పళణి, సెల్వం, జయపాల్‌, శివాజీ పాల్గొన్నారు. 

ఓజిలి :మండలంలోని పున్నేపల్లిలో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను ఆపార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ కన్వీనరు గుజ్జలపూడి విజయకుమార్‌నాయుడు అధ్వర్యంలో కేక్‌కట్‌ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. నాయకులు పురుషోత్తం రాజు, శ్రీనివాసులురెడ్డి, రాజా, శ్రీనివాసులు ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓజిలిలోని బస్టాండు సెంటరులో కూడా ప్రత్యేకంగా లోకేష్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. 

Updated Date - 2022-01-24T04:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising