ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలోనే పెనుబల్లికి స్వర్ణయుగం

ABN, First Publish Date - 2022-01-22T04:48:14+05:30

మండలంలో టీడీపీ హయాంలో తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పెనుబల్లికి ఓ స్వర్ణయుగమని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు

పెనుబల్లిలో పోలంరెడ్డి, దినేష్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన స్థానిక నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి


బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 21: మండలంలో టీడీపీ హయాంలో తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పెనుబల్లికి ఓ స్వర్ణయుగమని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పెనుబల్లిలో మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య అధ్యక్షతన జరిగిన టీడీపీ గౌరవసభకు ఆయనతోపాటు రాష్ట్ర యువత అధ్యక్షుడు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి పాల్గొన్నారు. మరో మూడు నెలలకు మూడేళ్లు పూర్తి కావస్తున్న వైసీపీ ప్రభుత్వం పెనుబల్లిలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిని పోలంరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ప్రజల ఇబ్బందులపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. ముందుగా ఆయన స్థానిక ప్రధాన కూడలిలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్‌కే. సన్వీర్‌ అనే బాలుడికి రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు.  కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, హరనాథ్‌, రామానాయుడు, చైతన్య, మల్లారెడ్డి, దశరథ, వి.శీనయ్య, జొన్నవాడ సర్పంచు, వైస్‌ సర్పంచు, ఉమ్మయ్యస్వామి, శ్రీధర్‌స్వామి తదితరులు  పాల్గొన్నారు.  


టీడీపీలోకి స్థానిక నాయకుల చేరిక

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి, యువత రాష్ట్ర అధ్యక్షుడు దినేష్‌రెడ్డి సమక్షంలో వైసీపీ, సీపీఎం నుంచి 20మంది నాయకులు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - 2022-01-22T04:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising