విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి
ABN, First Publish Date - 2022-08-05T04:59:32+05:30
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన గురువారం పంటపాళెం సమీపంలో జరిగింది.
ముత్తుకూరు, ఆగస్టు4: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన గురువారం పంటపాళెం సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు సౌత్ ఇండియా పామాయిల్ ప్యాక్టరీ సమీపంలో ఆయిల్ లోడ్ చేసుకునేందుకు తీసుకువచ్చిన ట్యాంకర్‌ను క్లీన్ చేస్తుండగా డ్రైవర్ రావుల మురళీకృష్ణ(27)కు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం నెల్లూరు తరలించారు. అప్పటికే మృతి చెందాడని తెలియడంతో మృతదేహాన్ని పంటపాళెంకి తీసుకువచ్చారు. మృతుడిది పొదలకూరు మండలం కనుపర్తి. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు అందోళన చేపట్టారు. మురళీ కుటుంబానికి పరిహారం అందజేసి ఆదుకునేందుకు కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. ముత్తుకూరు ఎస్‌ఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసుకుని, మురళీకృష్ణ మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Updated Date - 2022-08-05T04:59:32+05:30 IST