ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట‘మోత’!

ABN, First Publish Date - 2022-05-24T05:50:12+05:30

పేదవాడి యాపిల్‌ టమోటా ధర చుక్కలనంటుతోంది. ఈ నెల ఆరంభంలో కిలో రూ.60 ఉండగా ఇప్పుడు వంద నుంచి 120లు పలుకుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిలో వంద పైమాటే!

వంకాయ, పచ్చిమిర్చి ధరలకూ రెక్కలు


పేదవాడి యాపిల్‌ టమోటా ధర చుక్కలనంటుతోంది.  ఈ నెల ఆరంభంలో కిలో రూ.60 ఉండగా ఇప్పుడు వంద నుంచి 120లు పలుకుతోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి, వాల్మీకిపురం మార్కెట్ల నుంచి జిల్లాకు ఎక్కువగా టమోటా దిగుమతి అవుతుంది. అయితే, ఇటీవల ధరలు పూర్తిగా పతనం కావడంతో టమోటా రైతులు పంట విరామం ప్రకటించారు. దీంతో  ఉత్పత్తి లేక డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. జిల్లాలోని మార్కెట్లకు ప్రతిరోజు దాదాపు 500 మెట్రిక్‌ టన్నుల టమోటా దిగుమతి అవుతుండగా, ప్రస్తుతం 300 మెట్రిక్‌ టన్నులకు పడిపోయింది. ఒక్క నెల్లూరు మార్కెట్టుకే రోజుకు 150 మెట్రిక్‌ టన్నుల టమోటాలు దిగుమతి అవుతుండగా, 60 మెట్రిక్‌ టన్నులు మాత్రమే దిగుమతి అవుతోంది. మరోవైపు కిలో వంకాయలు రూ.40 నుంచి 70కి, పచ్చిమిర్చి కూడా 60లకు చేరింది. ఇక ఆకుకూరలైతే పట్టుకుంటేనే కందిపోతోంది. ఈ నెల ఆరంభంలో పదికి ఆరు కట్టలు ఇచ్చిన వ్యాపారులు ఇప్పుడు 20కి నాలుగు ఇస్తున్నారు. రానున్న రెండు నెలల్లో  కాయగూరల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

- నెల్లూరు (వ్యవసాయం)


 

రైతు బజార్లలో రూ.60లకే!

నేటి నుంచి అమ్మకాలు

ఒక్కో కుటుంబానికి 2 కేజీలు మాత్రమే


నెల్లూరు (వ్యవసాయం), మే 23 :  జిల్లాలోని రైతు బజార్లలో కిలో టమోటాను రూ.60లకు అందిస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ ప్రాంతీయ సహాయ సంచాలకుడు కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు ఏఎంసీ కార్యాలయంలో జిల్లాలోని మార్కెటింగ్‌ కార్యదర్శులు, రైతు బజార్ల ఎస్టేట్‌ అధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో కోలార్‌, మదనపల్లి, పలమనేరు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు టమోటాలు కొనుగోలు చేసి, ఒక్కో కుటుంబానికి రెండు కిలోల వంతున మంగళవారం నుంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ ఏడీ రామమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising