ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రంథాలయాలకు పూర్వ వైభవం

ABN, First Publish Date - 2022-10-02T05:10:07+05:30

జిల్లాలోని గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

జిల్లా గ్రంథాలయంలో పేరుకు పోయినబూజును దులుపుతున్న మంత్రి కాకాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూజు దులిపిన మంత్రి కాకాణి

నెల్లూరు (సాంస్కృతికం) అక్టోబరు 1 : జిల్లాలోని గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. జిల్లా గ్రంథాల సంస్థలో శనివారం  జరిగిన మనం మన గ్రంథాలయం కార్యక్రమానికి  మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గ్రంథాలయాలకు మౌలిక వసతులు కల్పిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రంథాలయ పాలకులకు ల్యాప్‌లాప్‌లు, పుస్తకాలను అందజేశారు. అంతకుముందు మంత్రి నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. నత్తనడకన నడవడంపై అసంతృప్తి  చెందారు. వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రంథాలయంలో పేరుకుపోయిన బూజును ఆయనే స్వయంగా దులిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శేషగిరిరావు, జాయింట్‌ కలెక్టర్‌ కూర్మానాఽథ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ దొంతు శారద, కార్యదర్శి కె.కుమార్‌రాజా, డిప్యూటీ లేబ్రేరియన్‌ సీహెచ్‌ ప్రసాద్‌, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-02T05:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising