విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
ABN, First Publish Date - 2022-12-07T23:45:15+05:30
విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు.
ఆత్మకూరు, డిసెంబరు 7 : విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం పట్టణంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్యర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నేత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ కాలేజీలు ప్రారంభమై ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయలేదన్నారు. వసతిగృహాల్లో వసతులు మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెస్ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు బాలాజీ, రాజేష్, ఖాదర్, అనిల్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:45:19+05:30 IST