ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల హాజరు అరకొరే..!

ABN, First Publish Date - 2022-01-18T03:41:58+05:30

సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతం అరకొరగానే ఉంది.

పాఠశాలకు హాజరైన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, జనవరి 17: సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థుల హాజరు శాతం అరకొరగానే ఉంది. వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపేందుకు భయపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే అధికారికంగా ఐదుగురు ఉపాధ్యాయులు కరోనా పాజిటివ్‌కు గురైనట్లు విద్యాశాఖాధికారులు తెలుపుతున్నారు. మండలంలో 66 పాఠశాలల్లో 5,139 మంది విద్యార్థులు ఉండగా సోమవారం 2,809 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఉదయగిరి ఉన్నత పాఠశాలలో 620 మంది విద్యార్థులకు 155 మంది మాత్రమే హాజరయ్యారని ఉపాధ్యాయులు తెలిపారు. కొన్ని తరగతులకు ఒకరిద్దరు విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు పొడిగించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-01-18T03:41:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising