ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందుకూరులో వీధిలైట్ల నిర్వహణ అధ్వానం

ABN, First Publish Date - 2022-07-08T05:07:41+05:30

మున్సిపాలిటీలో వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. 50 కుటుంబాలకు ఒక వలంటీరు పనిచేస్తుం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జూలై7: మున్సిపాలిటీలో వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా మారింది. 50 కుటుంబాలకు ఒక వలంటీరు పనిచేస్తుం డటమే గాక ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం, డయల్‌ యువర్‌ కమిషనర్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఏ మాత్రం ప్రయోజనం కనిపించటం లేదు. సమాచారం లేక వీధిలైట్లు గురించి నెలల తరబడి పట్టించుకోవటం లేదా లేక సమాచారం ఉన్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని ప్రజలు వాపో తున్నారు. ప్రధాన రహదారుల్లోనే అంధకారం అలముకుని ఉండగా లైట్లు వెలిగించాలన్న ధ్యాసే మున్సిపల్‌ అధికారులకు లేదు. 

రెండు నెలలుగా ఇదే పరిస్థితి

గవర్నమెంటు హాస్పటల్‌ సెంటర్‌ నుంచి పామూరు రోడ్డు కార్నర్‌ వరకు కేవలం నాలుగైదు చోట్ల మాత్రమే వీధి లైట్లు వెలుగుతుండగా పామూరు రోడ్డు కార్నర్‌ నుంచి ప్రశాంతి కాలనీ వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా వీధిలైటు వెలగటం లేదు. గత రెండు నెలలుగా ఇదే పరి స్థితి ఉంది. అంతకుముందు కూడా అక్కడక్కడా ఒకటి అరా లైటు మాత్రమే వెలుగుతుండేదని రెండునెల లుగా పూర్తిగా అంధకారం అలముకుందని స్థానికులు చెబుతు న్నారు. అలాగే కనిగిరి రోడ్డు, ఓవీ రోడ్డు, కోవూరు రోడ్డు లాంటి ప్రధాన మార్గాలలో కూడా సగానికి పైగా వీధి లైట్లు నెలల తరబడి వెలగకపోయినా పట్టించుకునే వారు కరువయ్యారని వ్యాపారులు, ప్రజలు విమర్శిస్తున్నారు. వీధిలైట్లు వెలగకపోతుండటంతో ప్రధాన రహదారుల్లో ఎదురొచ్చే వాహనాల లైట్ల వల్ల ఇబ్బందిగా ఉంటుందని పాదచా రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నివాస ప్రాంతాలు, శివారు కాలనీల్లోనూ..

ప్రధాన రహదారులలో పరిస్థితి ఇలా ఉండగా ఇక పట్టణంలోని నివాసప్రాంతాలు, శివారు కాలనీలలో వీధిలైట్లు నిర్వహణ నానాటికీ తీసికట్లు అన్న చందంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. పట్టణం లోని ఏ ప్రాంతానికి వెళ్లి చూసినా రమారమి సగం వీధిలైట్లు వెల గటం లేదని, కొన్ని ప్రాంతాలలో పూర్తిగా వీధి వీధంతా అంధ కారంగానే ఉంటుందని చెబుతున్నారు. తమ పరిధిలోని 50 నివా సాల పరిధిలో ఎలాంటి సమస్య ఉన్నా తక్షణం అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వలంటీర్లది కాగా వారు చెప్పటం లేదో లేక చెప్పినా అధికారులు పట్టిం చుకోవటం లేదో కానీ వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. గతంలో పరిస్థితి ఇలా ఉండేదికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికా రులు, ప్రజా ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుని వీధిలైట్ల నిర్వ హణ తీరును మెరుగుపరచాలని కోరుతున్నారు.

Updated Date - 2022-07-08T05:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising