సోమశిల అడవుల్లో అటవీ అధికారుల కూబింగ్
ABN, First Publish Date - 2022-12-07T00:05:09+05:30
సోమశిల జలాశయం వద్ద శ్రీపెనుశిల అభయారణ్యంలో మంగళవారం కడప, నెల్లూరు జిల్లా అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కూబింగ్ నిర్వహించారు
అనంతసాగరం, డిసెంబరు 6 : సోమశిల జలాశయం వద్ద శ్రీపెనుశిల అభయారణ్యంలో మంగళవారం కడప, నెల్లూరు జిల్లా అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కూబింగ్ నిర్వహించారు డీఎఫ్‌వో చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు, రాపూరు, కడప జిల్లా చిట్వేల్ అధికారులు జలాశయం లోతట్టు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణ, వన్యప్రాణుల సంరక్ష.ణలో భాగంగా ఈ కూబింగ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జలాశయం లోతట్టు నుంచి జాలర్లు తెచ్చిన చేపలు నిల్వ చేసే ఐస్ బాక్సులను తనిఖీ చేశారు. అడవులను సంరక్షించడం అందరి బాధ్యత కాగా ఎర్రచందనం అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఖాజారంతుల్లా, బీట్ అధికారులు నాగరాజు, జనార్ధన్, రాహుల్, మహేష్ తదితరలు పాల్గొన్నారు.
=====
Updated Date - 2022-12-07T00:05:11+05:30 IST