ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాతమ్మ చిందులు నిర్వహించకుండా చర్యలు

ABN, First Publish Date - 2022-05-16T03:54:35+05:30

మండలంలోని చవటపల్లి గ్రామంలో నాగారప్పమ్మతల్లి కొలుపుల్లో భాగంగా మాతమ్మ చిందులు నిర్వహించకుండా ఉదయగిరి సీఐ గిరిబాబు చర్యలు చేపట్టారు.

నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్న సీఐ గిరిబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, మే 15: మండలంలోని చవటపల్లి గ్రామంలో నాగారప్పమ్మతల్లి కొలుపుల్లో భాగంగా మాతమ్మ చిందులు నిర్వహించకుండా ఉదయగిరి సీఐ గిరిబాబు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అప్పసముద్రం పంచాయతీ చవటపల్లి గ్రామంలో మాతమ్మ చిందులు నిర్వహిస్తున్నారనే సమాచారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందన్నారు. దీంతో జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు శనివారం రాత్రి ఎస్‌ఐలు బాలమహేంద్రనాయక్‌, లతీపున్నీసా, సిబ్బందితో గ్రామానికి చేరుకొని కొలుపులు నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి నిర్వాహకులకు అవగాహన కల్పించామన్నారు. మాతమ్మ నిర్వహించే కార్యక్రమాలను పూజార్లచే నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు. ఇలాంటి నిషేధిత కార్యక్రమాలను ప్రోత్సహించిన వారు కూడా నేరస్తులవుతారన్నారు. కొలుపులు పూర్తయ్యేవరకు పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-05-16T03:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising