ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఆర్థిక సాయం

ABN, First Publish Date - 2022-05-19T03:27:24+05:30

జిల్లా ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ 2021వ సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలకు నెల్లూరు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌ అండ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆర్థిక సాయం అందించారు.

చెక్కు అందజేస్తున్న సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ హేమంత్‌ నాగరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం), మే 18: జిల్లా ఎస్‌ఈబీ, ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ 2021వ సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలకు నెల్లూరు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్స్‌ అండ్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆర్థిక సాయం అందించారు. అనారోగ్యంతో మృతి చెందిన హెడ్‌కానిస్టేబుళ్లు కే శ్రీనివాసరావు, ఎస్‌కే యస్ధానీబాషా, కానిస్టేబుళ్లు ఎం రామకృష్ణయ్య, పీ.భాస్కర్‌, ఆర్‌.లక్ష్మి, టి.వెంకటస్వామిల కుటుంబ సభ్యులకు సెబ్‌ డిప్యూటీ కమిషనర్‌ కే హేమంత్‌ నాగరాజు సెబ్‌ డీసీ కార్యాలయంలో ఈ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఏ.శీనయ్య మాట్లాడుతూ అసోషియేషన్‌ తరపున మృతి చెందిన ఒక్కొక్కరికి రూ.40 వేలు చొప్పున ఆరుగురుకి రూ.2.40 లక్షల అందించామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ డీ.శ్రీరామ చంద్రమూర్తి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కే.వెంకటరామిరెడ్డి, ఎస్‌ రవికుమార్‌, అసోసియేషన్‌ నాయకులు బీ దయాకర్‌, ఎం కిరణ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T03:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising