ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-10-01T04:35:36+05:30

నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వరోజు శుక్రవారం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.

గాయత్రి అలంకరణలో కనేకాపరమేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వివిధ అలంకారాల్లో దర్శనం

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) సెప్టెంబరు 30 : నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వరోజు శుక్రవారం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 48వ మహోత్సవాల్లో భాగంగా ఉజ్జయిని మహంకాళీ దేవి శక్తిపీఠంతో పాటు పిఠాపురం పూరుహుతికా దేవిగా, అమ్మవారి అలంకారాల్లో భాగంగా గజలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. నవావరణ పూజలు, చండీ హోమం, అర్చనలు, లలిత పారాయణం సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. అష్టాదశ శక్తి పీఠాలలో అమ్మవారిని అలంకరించారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా సాధారణ భక్తుల వలె క్యూలైన్‌లలో వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి పూజలు చేశారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షించారు. . ప్రత్యేక పుష్పాలంకారం కూడా నిర్వహించారు. 

 కోదండరామపురం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు.

 స్టోన్‌హౌస్‌పేటలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్ర ఉషారాణి వారిచే అన్నమయ్య కీర్తనలు అలరించాయి. 

 మూలాపట శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 7గంటలకు నవావరణ పూజ, పుష్పాలంకరణ, 8గంటలకు ఛండీ హోమం, రాత్రి 7గంటలకు అన్నపూర్ణాలంకారంతో భక్తులకు కనుల పండువగా దర్శనమిచ్చారు. 

 నవాబుపేటలోని శ్రీకృష్ణధర్మరాజుస్వామి వారి దేవస్థానంలో అమ్మవారికి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారు వివేష పరిమళ పుష్పాలతో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. 

ఫ సంతపేట శ్రీభ్రమరాంబ సమేత హరిహరనాథస్వామి దేవస్థానంలో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. 

వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో దసరా దేవీ శరన్నవరాత్రి శ్రీలలితా మహేశ్వరి దేవి అలంకారంలో, అయ్యప్పగుడిలో మహాలక్ష్మీదేవికి అలంకారం, కోదండరామపురం మహాలక్ష్మి ఆలయంలో ధనలక్ష్మి, నవాబుపేట శ్రీకృష్ణధర్మరాజుస్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. 

  మోహినీ అవతారంలో శ్రీనివాసుడు

 నెల్లూరు ( వెంకటేశ్వరపురం) : నగరంలోని వెంకటేశ్వరపురంలో ఉన్న శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా శరన్నవరాత్రులను నిర్వహిస్తున్నారు. శుక్రవారం చంద్రప్రభ వాహనంపై స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు సాయిభరద్వాజ్‌ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉభయ కర్తలుగా పులి కోదండరామయ్య, ఇందిర వ్యవహరించారు. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులను ఆకట్టుకొన్నాయి.

Updated Date - 2022-10-01T04:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising