ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి నెడుతున్నారు : ఇంటూరి

ABN, First Publish Date - 2022-07-02T03:28:28+05:30

సంక్షేమ పథకాల అమలు పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతోందని కందుకూ

భీమవరంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఇంటూరి నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉలవపాడు, జూలై 1: సంక్షేమ పథకాల అమలు పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతోందని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. మండలంలోని భీమవరంలో ఆయన శుక్రవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  డీజిల్‌ సెస్‌ పేరుతో మరోమారు రూ. 500 కోట్లు భారాన్ని జగన్‌ ప్రజలపై మోపాడని దుయ్యబట్టారు. భీమవరంలో ఇసుక రీచ్‌ లేకున్నా పంచాయతీ కార్యదర్శి ఇసుక తోలుకునుందుకు అనుమతి పత్రాలు ఎలా  ఇస్తారని ప్రశ్నించారు. తొలుత ఇంటూరికి పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.  అనంతరం ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి   ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. కాగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తమ్మిశెట్టి శ్రీను, తమ్మిశెట్టి మధు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T03:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising