ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులు తవ్వేస్తున్నారు..!

ABN, First Publish Date - 2022-04-06T03:59:47+05:30

అంతా మా ఇష్ణం.. మాకు అడ్డెవరంటూ గ్రామాల్లో పెట్రేగిపోతున్న అధికార పార్టీ నేతలు చెరువులను కుళ్లబొడుస్తున్నారు.

చెరువులో మట్టి తవ్వుతున్న ఎక్స్‌కవేటర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్‌ అక్రమ రవాణా

రేయింబవళ్లు అధికార పార్టీ నేతల దందా

పట్టించుకోని అధికారులు, పాలకులు

కావలి రూరల్‌, ఏప్రిల్‌ 5: అంతా మా ఇష్ణం.. మాకు అడ్డెవరంటూ గ్రామాల్లో పెట్రేగిపోతున్న అధికార పార్టీ నేతలు చెరువులను కుళ్లబొడుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వకాలు చేస్తూ రేయింబవళ్లు గ్రావెల్‌, ఇసుక, మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కావలి పట్టణ, పరిసర ప్రాంతాల్లో వెలుస్తున్న లే అవుట్‌లకు అర్ధరాత్రి సమయంలో చెరువుల్లోని మట్టి, గ్రావెల్‌ను అధికారపార్టీ నేతల సహకారంతో యథేచ్ఛగా తరలిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఈ క్రమంలో మంగళవారం కావలి మండలం రుద్రకోట చెరువులో అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్నారని గ్రామస్థులు ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా అర్ధరాత్రిళ్లు ఎక్స్‌వేటర్‌తో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 10 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టి టిప్పర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో మట్టి తరలించిన గుంటల్లో చేరే నీటిలో పడి పలువురు మృత్యువాత పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు

రుద్రకోట చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చింది. పరిశీలించి అనుమతులు లేకుండా మట్టి, గ్రావెల్‌ తరలిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. 

- జంపాని కిరణ్‌, ఇరిగేషన్‌ ఏఈ

Updated Date - 2022-04-06T03:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising