ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత పద్ధతిలోనే ఆర్టీసీ సర్వీసులు

ABN, First Publish Date - 2022-01-28T03:16:49+05:30

పాత పద్దతిలోనే ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌ చెలికం శంకర్‌ రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న చెలికం శంకర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), జనవరి 27: పాత పద్దతిలోనే ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ ఆర్టీసీ రీజనల్‌ చైర్మన్‌ చెలికం శంకర్‌ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక నేదుమల్లి రాంకుమార్‌ రెడ్డి నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ గత మూడు నెలలుగా ఈ సమస్యపై పలు సేవా సంఘాలు పోరాడుతున్న సమస్య పరిష్కరం కాలేదన్నారు. ఈ విషయాన్ని కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదుమల్లి రాంకుమార్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరం చేయించారని తెలిపారు. ప్రజలందరికి అనుకూలంగా ఉన్న పాత బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ సర్వీసులు పాత పద్దతిలోనే నిలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కొత్త జిల్లాలు తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉందన్నారు. తిరుపతికి శ్రీ బాలాజీ జిల్లా పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ బాలాజీ పేరు నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపాదనలో ఉందని అయితే ఆయన కోరిక జగన్‌ మోహన్‌ రెడ్డి తీర్చడం చాల సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దశరధరామిరెడ్డి, పులి ప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T03:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising