ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూరేటిపల్లి - చినపవని రోడ్డులో రూ. 6 లక్షల దోపిడీ

ABN, First Publish Date - 2022-05-25T03:01:21+05:30

కందుకూరు బ్యాంక్‌ నుంచి నగదు విత్‌డ్రా చేసుకొని ఇంటికి వెళుతుండగా రూ. 6 లక్షల నగదు దోపిడీ జరిగింది. ఈ సంఘటన గుడ్లూరు

పూరేటిపల్లి దగ్గర ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడ్లూరు, మే 24 : కందుకూరు బ్యాంక్‌ నుంచి నగదు విత్‌డ్రా చేసుకొని ఇంటికి వెళుతుండగా  రూ. 6 లక్షల నగదు దోపిడీ జరిగింది. ఈ సంఘటన గుడ్లూరు మండ లంలోని పూరేటిపల్లి - చినపవని రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, లింగసముద్ర మండలం చినపవని కమ్మపాలెంకు చెందిన కేశినేని ప్రసాద్‌ కందుకూరులోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ. 6 లక్షల నగదు విత్‌డ్రా చేసుకొని చినపవనికి ద్విచక్ర వాహనంపై వెలుతున్నాడు. మార్గమధ్యంలో పూరేటిపల్లి  దాటిన తరువాత గుర్తు తెలియని  వ్యక్తి ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చి ముందుపోతున్న ప్రసాద్‌ వాహనానికి అడ్డుపెట్డాడు. అనంతరం ప్రసాద్‌ దగ్గరున్న క్యాష్‌ బ్యాగ్‌ను  లాక్కొని పరారయ్యాడు. దీంతో అతన్ని కొంతదూరం వెంబడించినా లాభం లేకపోయింది.   దీంతో ప్రసాదు పొలీస్‌ స్టేషన్‌కు సమాచా రం అందించాడు. సీఐ శ్రీరాం, ఎస్సై మల్లికార్జున నేతృత్వంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Updated Date - 2022-05-25T03:01:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising