రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ABN, First Publish Date - 2022-02-05T05:21:07+05:30
మండల పరిధిలోని జాతీయ రహదారిపై వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
మనుబోలు, ఫిబ్రవరి 4: మండల పరిధిలోని జాతీయ రహదారిపై వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కొమ్మలపూడికి చెందిన ముత్యాలయ్య మోటార్ బైక్‌పై మనుబోలుకు వస్తుండగా.. కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద వీరంపల్లికి చెందిన కంటిపల్లి నరేంద్ర లిఫ్ట్ అడిగాడు. ఇద్దరు పూటుగా మద్యం సేవించి బైక్‌ను అడ్డదిడ్డంగా నడుపుతుండగా ప్రొద్దుటూరు నుంచి చెన్నై వెళుతున్న కారును ఢీకొనగా ప్రమాదం తప్పి, దాని వెనుక వస్తున్న కారు మోటార్‌సైకిల్‌ను ఢీకొనింది. దీంతో బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా 108 సిబ్బంది వారికి ప్రథమ చికిత్స చేసి గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-02-05T05:21:07+05:30 IST