ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

71గ్రామాల్లో రీసర్వే పూర్తి

ABN, First Publish Date - 2022-10-12T05:03:24+05:30

నెల్లూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రెండువిడతల్లో 71 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని నెల్లూరు ఆర్డీవో మాలోల తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మనుబోలు, అక్టోబరు 11: నెల్లూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో రెండువిడతల్లో 71 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామని నెల్లూరు ఆర్డీవో మాలోల తెలిపారు. మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రీసర్వేపై ఆయన సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆర్డీవో మాట్లాడుతూ రీసర్వేతో భూమి స్థితి కచ్చితంగా వస్తుందన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్టోబరులో హక్కుపత్రాలు ఇవ్వడంలో జాప్యం జరిగిందన్నారు. హక్కుపత్రాల పంపిణీలో ఎలాంటి తప్పిదాలు లేకుండా మరో మారు రికార్డుల పరిశీలన చేయిస్తున్నామన్నారు. రోవర్‌, డ్రోన్‌లతో రీసర్వే ఎన్నిదఫాలు చేసినా ఒకేలా వస్తుందన్నారు. తొలివిడతలో 37, రెండో విడతలో 34 గ్రామాల్లో రీసర్వేని పక్కాగా చేయించామన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీలో ఎండీయూ ఆపరేటర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్‌లు బాలకోటమ్మ, , నాగేశ్వరరావు, ఆర్‌ఐ. శివప్రసాద్‌, వీఆర్‌వోలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-12T05:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising