ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ నిర్మాణాల్లో పురోగతి లేకుంటే చర్యలు : ఆర్డీవో

ABN, First Publish Date - 2022-08-10T04:11:27+05:30

జగనన్న లే అవుట్లలో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్డీవో జీవీ సుబ్బారెడ్డి కోరారు.

గృహ నిర్మాణాలు పరిశీలిస్తున్న ఆర్డీవో సుబ్బారెడ్డి, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, ఆగస్టు 9: జగనన్న లే అవుట్లలో గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్డీవో జీవీ సుబ్బారెడ్డి కోరారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని దూబగుంట, దివివారిపాలెం, కొండికందుకూరు, మహదేవపురం, ఆనందపురం లే అవుట్లను ఆయన హౌసింగ్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు, వార్డు సచివాలయాల సిబ్బందితో కలిసి పరిశీలించారు. పలు కాలనీల్లో ఒక్క గృహం కూడా పురోగతి లేకపోవడం, కొండి కందుకూరులో 15, దివి వారిపాలెంలో 30 గృహాలకు పునాదులు వేసి వదిలేసి ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహదేవపురంను 897 ఫ్లాట్లకి కేవలం 240 మంది మాత్రమే గృహ నిర్మాణం ప్రారంభించగా వాటిలో కూడా అతి తక్కువ గృహాలు మాత్రమే పురోగతిలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో 2300 మందికి పైగా లబ్ధిదారులకు జగనన్న లే అవుట్లలో నివాసస్థలాల పట్టాలు ఇచ్చి ఉండగా కేవలం 587 మంది మాత్రమే గృహాల నిర్మాణం ప్రారంభించడంపై ఆగ్రహం వ ్యక్తం చేశారు. 1700 మందికి పైగా లబ్ధిదారులు అసలు గృహ నిర్మాణమే ప్రారంభించలేదని, ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే అందరూ బాఽధ్యులమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దారు డి. సీతారామయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌. మనోహర్‌, హౌసింగ్‌ డీఈఈ నాగేశ్వరరావు, ఏఈఈ సీహెచ్‌ శ్రీనివాసరావు తదితరులున్నారు.

Updated Date - 2022-08-10T04:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising