తహసీల్దారు కార్యాలయం ఆర్డీవో ఆకస్మిక తనిఖీ
ABN, First Publish Date - 2022-04-21T04:33:06+05:30
కావలి తహసీల్దారు కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం కావలి ఆర్డీవో శీనానాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, కంప్యూటర్లలో భూముల వివరాలను పరిశీలించారు.
కావలి, ఏప్రిల్ 20 : కావలి తహసీల్దారు కార్యాలయాన్ని బుధవారం సాయంత్రం కావలి ఆర్డీవో శీనానాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, కంప్యూటర్లలో భూముల వివరాలను పరిశీలించారు. భూముల రీసర్వే ఎంతవరకు పూర్తయిందనే దానిపై ఆకస్మిక తనిఖీ చేసనట్లు తెలుస్తుంది. కావలి మండలంలో భూముల రీసర్వేకు మన్నెంగిదిన్నె, ఆనెమడుగు గ్రామాలను ఎంపిక చేశారు. మన్నెంగిదిన్నెలో భూసర్వే చాలావరకు పూర్తి అయింది. ఆనెమడుగులో భూసర్వే మందకొడిగా జరుగుతండటంతో ఆర్డీవో తనిఖీ చేసి సర్వే ఎంతవరకు పూర్తి అయిందో తెలుసుకుని ఈ నెల 24వతేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కావలి తహసీల్దారు మాధవరెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రెడ్డి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2022-04-21T04:33:06+05:30 IST