ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల భూములు పరిశీలించిన ఆర్డీవో

ABN, First Publish Date - 2022-07-03T05:37:35+05:30

కందుకూరు డివిజన్‌లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు సాగించిన రైతుల భూములను ఆర్డీవో జి.వి. సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు.

పోట్లూరులో భూములను పరిశీలిస్తున్న ఆర్డీవో సుబ్బారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జూలై 2: కందుకూరు డివిజన్‌లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మకాలు సాగించిన రైతుల  భూములను ఆర్డీవో జి.వి. సుబ్బారెడ్డి శనివారం పరిశీలించారు. గుడ్లూరు మండలం  పోట్లూరు, నాయుడుపాలెం, చిమిడితపాడు, లింగసముద్రం మండలం అన్నెబోయినపల్లి, కొండాపురం మండలం నేకునాంపేట, కొండాపురం, గానుగపెంట గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసి ధాన్యం విక్రయాలు చేసిన రైతుల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల పరిధిలో ఆర్‌బీకేలలో ధాన్యం విక్రయించిన రైతుల భూములను పరిశీలించారు. రైతులు చూపిన సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో వాస్తవంగా వరి పంట సాగు చేశారా ఇతర పంటలు సాగులో ఉన్నాయా అన్న కోణంలో ఆర్డీవో భూములను పరిశీలించారు. 

లింగసముద్రం :  కందుకూరు ఆర్డీవో సుబ్బారెడ్డి శనివారం మండలంలోని అన్నె బోయినపల్లి రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన రికార్డులను పరిశీలించారు. రూ.3 లక్షల కంటే ఎక్కువ ధాన్యం అమ్మిన రైతుల గురించి ఆరా తీశారు.  పండించిన రైతులే అమ్మారా? లేక ఇతరుల ధాన్యం ఈ కేంద్రం ద్వారా అమ్మారా ఆ రైతులను విచారణ చేశారు.   అంతకు ముందు ఆయన పెదపవనింలో ముత్యాలపాడు రెవెన్యూలో భూమార్పిడి కోసం దరఖాస్తు చేసుకొన్న  భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆర్‌. బ్రహ్మయ్య, వీఎఎ రెడ్డి నాగేశ్వరి,  సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T05:37:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising