ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జూలై 21న మనుబోలులో రైతుపోరు

ABN, First Publish Date - 2022-06-29T04:18:58+05:30

ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 21వ తేదీన మనుబోలులో భారీస్థాయిలో రైతు పోరు నిర్వహించనున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వెల్లడించారు.

నాయకులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

5 జిల్లాల నాయకత్వంతో కలిసి భారీ ఆందోళన 

సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి 


నెల్లూరురూరల్‌, జూన 28 : ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 21వ తేదీన మనుబోలులో భారీస్థాయిలో రైతు పోరు నిర్వహించనున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వెల్లడించారు. మంగళవారం నెల్లూరురూరల్లోని అల్లీపురంలోని తన నివాసంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరుతోపాటు ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నాయకత్వంతో కలిసి భారీగా ఈ పోరు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత మీటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియపై రైతులతో కలిసి నిరసన గళాన్ని వినిపించాలని సూచించారు. ఆక్వా రైతులకు విద్యుత వినియోగంలో యూనిట్‌ ధర రూ.5.85  ఉండగా దానిని టీడీపీ ప్రభుత్వంలో రూ. 2లకు తగ్గించామని అందులోనూ రూ.1.50లకు తగ్గిస్తానన్న జగన నేటికీ తన హామీని అమలు పరచలేదని విమర్శించారు. దీనిని ప్రస్తావిస్తూ వైసీపీ సర్కారుపై ఒత్తిడి పెంచాలని సూచించారు. అలాగే ధాన్యం అమ్ముకున్న రైతులకు 21 రోజుల్లో నగదు వారి ఖాతాల్లో జమ చేస్తానన్న సీఎం హామీ అడ్రస్సు లేకుండా పోయింన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న పోలీసుల అరాచకాలను ఈ నిరసనలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వందల ఎకరాల కుంభకోణంలో పాత్ర, సూత్రధారులుగా ఉన్న తహసీల్దార్లపై నేటికీ చర్యలు లేవన్నారు. వీటన్నీటిపై రైతు పోరు నిర్వహించి అన్నదాతలకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌,  మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, జేడీ రాజశేఖర్‌, నెలవల సుబ్రహ్మణ్యం, పాశం సునీల్‌కుమార్‌, పరసారత్నం, నాయకులు బొమ్మి సురేంద్ర, వేనాటి సతీ్‌షరెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి,  పరిశీలకులు కుసుమ కుమారి పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T04:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising