ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-11-30T22:29:09+05:30

పురుగుల మందుతాగి పేముల రవి (37) ఆత్మహత్య చేసుకున్నాడు. కావలి మండలం ఆర్సీపాలెంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు, ఆర్సీపా

రవి మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి రూరల్‌, నవంబరు30: పురుగుల మందుతాగి పేముల రవి (37) ఆత్మహత్య చేసుకున్నాడు. కావలి మండలం ఆర్సీపాలెంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు, ఆర్సీపాలెంకు చెందిన రవికి అదే గ్రామానికి చెందిన సుజాతతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రవి బేల్దారి పనులు చేస్తుంటాడు. వారికి ఇద్దరు పిల్లలు. రవి ఇటీవల మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో నెలన్నర క్రితం సుజాత పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చింది. ఇటీవల అయ్యప్ప మాలవేసుకున్న రవి భార్యాపిల్లలను ఇంటికి రమ్మనడంతో ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన రవి మంగళవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని బంధువులు గుర్తించి 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ మేరకు రూరల్‌ ఎస్‌ఐ వీరేంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

------------

Updated Date - 2022-11-30T22:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising