ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు కోలుకోవాలని పూజలు

ABN, First Publish Date - 2022-01-20T05:14:23+05:30

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెల్లూరులో సర్వమత ప్రార్థనలు జరిగాయి.

రంగనాథ స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో సర్వమత ప్రార్థనలు

నెల్లూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెల్లూరులో సర్వమత ప్రార్థనలు జరిగాయి. సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లోని అన్ని డివిజన్లలో టీడీపీ నేతలు దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ సూచనల మేరకు రూరల్‌ నియోజకవర్గంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, బారా షహీద్‌ దర్గా, ది సాల్వేషన్‌ ఆర్మీ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు జెన్ని రమణయ్య, సాబీర్‌ ఖాన్‌, మెయినుద్దీన్‌, జాఫర్‌, కప్పిర శ్రీనివాసులు, జలదంకి సుధాకర్‌ తదితరులు ఉన్నారు. అలానే సిటీ నియోజకవర్గంలో ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సూచనల మేరకు సర్వమత ప్రార్థనలు జరిగాయి. పార్టీ నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు మామిడాల మధు, కువ్వారపు బాలాజీ, పొత్తూరు శైలజ, పెంచల నాయుడు, తిరుమల నాయుడు, బాలకృష్ణ చౌదరి, ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్‌, పిట్టి సత్యనాగేశ్వరరావు, ధర్మవరం గణేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


వైద్య వీరరాఘవ స్వామి ఆలయంలో

నెల్లూరు(వైద్యం) : చంద్రబాబు, లోకేష్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి బుధవారం నగరంలోని వైద్య వీరరాఘవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వం పార్టీకేకాదు రాష్ట్రానికీ చాలా అవసరం అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T05:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising