ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల హక్కులు హరిస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-01-24T04:02:24+05:30

ప్రభుత్వం ఉద్యోగులు హక్కులు హరిస్తూ మానసికంగా కుంగదీస్తోందని పీఆర్సీ సాధన సమితి నేతలు పేర్కొన్నారు.

ఐక్యత చాటుతున్న పీఆర్సీ సాధన సమితి సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఆర్సీ సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశం

కావలిటౌన్‌, జనవరి 23: ప్రభుత్వం ఉద్యోగులు హక్కులు హరిస్తూ మానసికంగా కుంగదీస్తోందని పీఆర్సీ సాధన సమితి నేతలు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎమ్పీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పీఆర్సీ సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎస్‌ శివకుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో ఐక్యవేదికగా ఏర్పడి రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి పీఆర్సీ సాధనకు చేపట్టాల్సిన కార్యరచరణపై చర్చించామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకు ఉద్యమరూపంలో ప్రభుత్వంతో తేల్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రకటించిన కార్యాచరణ అమలు చేస్తామన్నారు. సమావేశంలో ఫ్యాప్టో అధ్యక్షుడు కంచర్ల మధుసూదనరావు, వివిధ శాఖల ఉద్యోగుల సంఘం నుంచి శ్రీనివాసరావు, నరసారెడ్డి, దీక్షితులు, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-24T04:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising