ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

ABN, First Publish Date - 2022-11-24T22:22:36+05:30

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయ ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌(ఐసీఆర్‌పీ) పి.సుబ్బరాయుడు తెలిపారు.

ద్రవ జీవామృతంను తయారుచేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, నవంబరు 24 : ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయ ఇంటర్నల్‌ కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌(ఐసీఆర్‌పీ) పి.సుబ్బరాయుడు తెలిపారు. మండలంలోని కరటంపాడులో గురువారం టీటీడీ రైతులకు అందించే వరినారుకు ద్రవ జీవామృతం తయారు చేసే విధానం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ద్రవ జీవామృతంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది, పైరు ఏపుగా పెరుగుతుందని వివరించారు. అదే క్రమంలో చీడపీడలను తట్టుకుని వేరు శాతం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుందన్నారు. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. అలాకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వలన భూమిలో సారం పెరగడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంటీ సుబ్బమ్మ, పీఆర్‌పీ నాగరాజు, మాధురి, సర్పంచ్‌ రేవతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T22:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising