ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరజీవి శ్రీపొట్టిశ్రీరాములుకు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-12-16T00:09:14+05:30

పట్టణంలో శ్రీ పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహించారు.

సంగం: అమరజీవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పిస్తున్న ఆర్యవైశ్య నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, డిసెంబరు 15: పట్టణంలో శ్రీ పొట్టిశ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సత్రం సెంటర్‌ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పలువురు ఆర్యవైశ్య నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర అవతరణ కోసం పొట్టిశ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు. ఆత్మకూరు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌ ఎం.శ్రీనివాసులు, సెక్రటరీ ఓ.శ్రీనివాసరావు, ట్రెజరర్‌ డి.శ్రీనివాసులు, మెంటా హజరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఎల్‌ఆర్‌పల్లి-1 అంగన్‌వాడీ కేంద్రానికి మున్సిపల్‌ మేనేజర్‌ మనమడు తెగ్విన్‌ సీలింగ్‌ ఫ్యాన్‌ బహూకరించారు. అలాగే చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. వారి దాతృత్వానికి అంగన్‌వాడీ కార్యకర్త షకీల ధన్యవాదాలు తెలిపారు.

ఏఎస్‌ పేట: స్థానిక కస్తూరిబా బాలికల విద్యాలయంలో గురువారం శ్రీపొట్టిశ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాలయంలో ప్రత్యేకంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లుర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు పొట్టిశ్రీరాములు చేసిన కృషి గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంగం : స్థానిక గ్రంథాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, ఉక్కుమనిషి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు, సర్ధార్‌ పటేల్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి రవీంధ్రనాథ్‌రెడ్డి, నాయకులు కాకు మధుసూదన్‌ యాదవ్‌, గ్రంథి గోపికృష్ణ, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో..

స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణం, బస్టాండ్‌ సెంటర్‌లో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఆంధ్రరాష్ట్ర అవతరణకు కృషి చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతిని పురస్కరించుని ఆయన చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన తెలుగు జాతికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు రామారావు, వెంకటేశ్వర్లు, రాచపూటి రమేష్‌, రవీంధ్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising