ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొదుపు సొమ్ముతో అధ్యక్షురాలి పరారీ

ABN, First Publish Date - 2022-07-01T02:43:46+05:30

పొదుపు సభ్యుల సొమ్ము స్వాహా చేసి అధ్యక్షురాలు పరారైంది. ఈ సంఘటన గురువారం ఉదయగిరిలో వెలుగులోకి వచ్చిం

పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తున్న పొదుపు మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 30: పొదుపు సభ్యుల సొమ్ము స్వాహా చేసి అధ్యక్షురాలు పరారైంది. ఈ సంఘటన గురువారం ఉదయగిరిలో వెలుగులోకి వచ్చింది. సభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని దేవలాలగడ్డవీధిలో మహబూబ్‌సుభానీ పేరుతో పదిమంది సభ్యులు కలిసి పొదుపు గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రథమ అధ్యక్షురాలిగా అస్మా, రెండో అధ్యక్షురాలిగా అసియాలు కొనసాగుతున్నారు. గ్రూపులో అందరూ నిరక్షరాస్యులు కావడంతో కొన్నేళ్లుగా తొలి అఽధ్యక్షురాలు అస్మా రుణాలు తీసుకోవడం, చెల్లింపులు, బ్యాంకు లావాదేవీలు చూస్తుం డేది. ఈ క్రమంలో 2020జూన్‌లో గ్రూపు సభ్యులందరి ఆమోదంతో రూ.4లక్షలు రుణం తీసుకున్నారు. వచ్చిన రుణాన్ని అస్మా సభ్యులందరికి రూ.40వేలు చొప్పున అందజేసింది. కానీ అస్మా బ్యాంకు నుంచి రూ.4.50 లక్షల రుణం తీసుకొని బుక్‌లో సైతం తీర్మానం రాయించింది. ఈ విషయం సభ్యులకు తెలియదు. నాటి నుంచి సభ్యులు రుణానికి రూ.2వేలు, పొదుపునకు రూ.100లు చొప్పున ప్రతినెలా రూ.2,100లు అస్మాకు అందజేశారు. అస్మా సభ్యులు అందజేసిన సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేసింది. బుధవారం బ్యాంకు అధికారులు మహబూబ్‌సుభానీ గ్రూపు సభ్యులు రుణం తీసుకొని నగదు చెల్లించడంలేదని, చెల్లించకపోతే కోర్టుకు వేస్తామని వీవోఏకు సూచించారు. దీంతో వీవోఏ రెండో అధ్యక్షురాలైన అసియాకు సమాచారం అందించారు. ఆమె సభ్యులకు తెలియచేయడంతో వారంతా హుటాహుటిన బ్యాంకుకు వెళ్లి అధికారులను కలిశారు. మీ గ్రూపు తీసుకున్న రూ.4.50 లక్షల రుణంలో కేవలం రూ.25 వేలు మాత్రమే కట్టారని, మిగిలిన నగదు కట్టాలని అధికారులు సూచించడంతో వారు ఖంగుతున్నారు. తాము కూలినాలి చేసుకొని నెలనెలా అధ్యక్షురాలికి నగదు చెల్లిస్తున్నామని, ఇలా చేస్తుందని తమకు తెలియదని వారు తలలు పట్టుకున్నారు. అనంతరం వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం కార్యాలయానికి వెళ్లి సొమ్ము స్వాహా చేసిన విషయాన్ని అధికారులకు వివరించారు. అస్మా నెల్లూరులో ఉన్నట్లు సభ్యులు తెలుసుకొని, ఫోన్‌ నెంబర్‌ సేకరించి ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాప్‌ అని వచ్చింది. దీంతో చేసేదేమీ లేక సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-07-01T02:43:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising