ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెయ్య దూడల ఉత్పత్తితో ఆర్థికాభివృద్థి

ABN, First Publish Date - 2022-11-28T21:41:20+05:30

: రాష్ట్రీయ గోకుల మిషన్‌ సౌజన్యంతో అమలుచేస్తున్న పెయ్య దూడల ఉత్పత్తి పథకం ద్వారా పాల దిగుబడులు పెరిగి, రైతులు అర్థికాభివృద్థి చెందుతారని జిల్లా పశుగణాభివృద్థి సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ టీ సోమయ్య తెలిపారు.

మాట్లాడుతున్న డీడీ డాక్టర్‌ సోమయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలువాయి, నవంబరు 28 : రాష్ట్రీయ గోకుల మిషన్‌ సౌజన్యంతో అమలుచేస్తున్న పెయ్య దూడల ఉత్పత్తి పథకం ద్వారా పాల దిగుబడులు పెరిగి, రైతులు అర్థికాభివృద్థి చెందుతారని జిల్లా పశుగణాభివృద్థి సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ టీ సోమయ్య తెలిపారు. సోమవారం కలువాయిలో పశు వైద్యాధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెయ్య దూడల ఉత్పత్తి పథకం ద్వారా మేలుజాతి లింగ నిర్ధారిత వీర్యం ఉపయోగించి రైతులకు కావలసిన మేలైన పెయ్య దూడల ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. ఒక పశువు కృతిమ గర్భధారణకు రూ.625 విలువ కలిగిన రెండు ఇంజెక్షన్లు వేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం రైతు రూ.500లు చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని వివరించారు. మండలంలో ఎంపిక చేసిన ఒకొక్క గ్రామంలో 35 నుంచి 40 పశువులకు ఈ పథకం వర్తింప చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఏడీ పీ అన్నపూర్ణ, పశువైద్యులు సీహెచ్‌. కృష్ణమోహన్‌, పీ రాజేష్‌, కృష్ణప్రసాద్‌, కే గంగాధర్‌రావు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T21:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising